top of page

నవజీవనం

Noted Nest

By Shaik Riyaz Basha



   “బంధాలు బహు చిత్రమైనవని నీకు తెలుసా? మనం ఏదైయిన ఒక పని చెయ్యాలంటే అందులో సవాలక్ష ఆటంకాలు వస్తాయి. మరి ఆ సమస్యలన్నీ పరిష్కరించాలి అంటే కొన్ని సార్లు ఇతరుల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది.” అని తాతయ్య తన మనవడైన సురేంద్రతో అన్నాడు. అప్పుడు సురేంద్ర “ నిజమా తాతయ్య! ఇతరులకి సహాయం చెయ్యడం అంత అవసరమా? ” అన్నాడు.

            తాతయ్య  ఫణి వర్మ, నవ్వుతూ “ మనవడా, మనం మన కోసo డబ్బు, సమయం ఖర్చు చెయ్యడం ఎంత వరకు సంతోశాన్నిస్తాయో తెలియదు కాని మనల్ని నమ్మిన వాళ్ళ కోసం చేసే ప్రతి పని వాళ్లకి , అలాగే మనక్కూడా ఆనందాన్ని ఇస్తాయి” అన్నాడు. ఇదంతా అర్ధం కాని సురేంద్ర అయోమయంగా చూస్తుంటే , సమయం వచ్చినప్పుడు నీకే అర్ధం అవుతుంది అని చెప్పాడు. ఇంతలో సురేంద్ర ఒక్కసారిగా లేచి                             “ హోహ్! ఇదంతా నా కల”. ఛా, అనుకొని మొబైల్ లో తాతయ్య పాత ఫోటో చూస్తూ        “ ఎందుకు అలా చెప్పావ్ తాతయ్య, ఎందుకు! ఇక్కడ ఎవరు సహాయం చేసే మనుషులు లేరు అలాగే సహాయం పొందే అర్హత కూడ ఎవ్వరికి లేదు. ఒకరేమో నా స్నేహితుడు అని నమ్మితే వాడే నన్ను మోసం చేసి, నేను ఆరు నెలలు కష్టపడి పని చేసిన ప్రాజెక్ట్ ని కొట్టేసి వేరే సమస్త కి అమ్మేశాడు అలాగే నేను ప్రేమించిన అమ్మాయిని కూడా మాయ మాటలతో సొంతం చేసుకున్నాడు. మరి మిగితా వాళ్ళు, నేను బాగున్నంత కాలం నా వెనకే తిరిగి ఇప్పుడు అవకాశం రాగానే నన్ను నేరస్తుడిగా ముద్రించి వెళ్ళగొట్టారు. ఇంకా నేను నువ్వు చెప్పిన మాటలను పాటిస్తూవుంటే ఇక్కడ బ్రతకలేను. చూద్దాం కాలం ఇంకా ఎన్ని పరిక్షలు పెడుతుందో” అన్నాడు.

            సురేంద్ర ఒక అనాథ, చిన్నప్పుడే తనవాల్లందరినీ ప్రమాదంలో కోల్పోయాడు. అప్పటి నుండి తాతయ్య చెప్పిన మాటలు అనుసరిస్తూ పెరిగాడు. కొన్ని సంవత్సరాల తరువాత అతనికి ఉద్యోగం వచ్చిన కొత్తలో తాతయ్య కి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. కనీసం తాతయ్య కోసమే బ్రతుకుతున్న అతను చివరికి ఒంటరి వాడయ్యాడు. ఇప్పుడు జరిగిన మోసంతో అందరి మీద అభద్రతా భావం వచ్చి ఇకనుంచి ఎప్పుడు ఎవ్వరిని నమ్మకూడదు అని బలంగా అనుకున్నాడు.  ఉదయం లేవగానే ఇంటి ఓనర్ వచ్చి అద్దె అడిగితే రెండు రోజుల్లో ఇస్తానన్నాడు కాని ఉద్యోగం పోయింది అన్న విషయం మాత్రం చెప్పలేదు ఎందుకంటే ఒకవేళ ఆ విషయం తెలిసిపోతే  ఇల్లు ఖాళీ చెయ్యమంటాడేమో అనే భయం. అప్పుడే తనకి ఇంటర్వ్యూ కి రమ్మని ఒక కంపెనీ నుండి మెసేజ్ వచ్చింది. తన కష్టం నుండి బయటపడే అవకాశం వచ్చిందనుకున్నాడే  గాని ఆ మెసేజ్ వలన తన జీవితమే మారిపోతుందని ఊహించలేక పోయాడు.

            సురేంద్ర బస్సు కోసం ఎదురు చూస్తుంటే ఎవరో అరుస్తున్న శబ్దం వినబడింది. అది అతనికి తెలిసిన గొంతు కావడంతో అటు పక్కకి చుస్తే ఒక అమ్మాయి అబ్బాయిని కొడుతూ కనిపించింది, తీరా చుస్తే వాళ్ళిద్దరూ తన కాలేజీ స్నేహితులు – నవీన్ , నయన. సురేంద్ర వాళ్ళిద్దరిదెగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి నయన చెయ్యి పట్టుకొని ఆపాడు, కోపంలోవున్న నయన వెనిక్కి తిరిగి సురేంద్రని చూసి ఆనంద పడింది.               “హేయ్! సురేంద్ర బాగున్నావా?” అని అడిగింది. “కొట్టడం ఆపిందేంటి“ అని నవీన్ పైకి చుస్తే సురేంద్ర కనిపించాడు. మాటల మధ్యలో వాళ్ళిద్దరూ కూడా అదే కంపెనీ ఇంటర్వ్యూ కి వచ్చారని తెలిసింది , ముగ్గరూ కలిసి “ TECHNO FLASH SOLUTIONS “   అనే సాఫ్ట్వేర్ కంపెనీ లో ఇంటర్వ్యూ కి వెళ్ళారు, అందులో తమతో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలకి, ఒక అబ్బాయికి కూడా ఉద్యోగాలోచ్చాయి. హమ్మయ్య! అనుకొని ముగ్గురూ బయటికి వెళ్ళగానే సురేంద్ర నవీన్ ని చూస్తూ “ రేయ్! నీ చెల్లెలు ఎందుకు నిన్ను కొడుతూ ఉంది” అని అడిగాడు. అప్పుడు నవీన్ “ అదేంలేదు మామా , బస్సు నుంచి    ఆ స్టాప్ లో దిగాం కాని కండక్టర్ నుంచి మిగితా చిల్లర ఇప్పించుకోవడం మర్చిపోయా అందుకే వాయించిందిరా అమ్మోరు తల్లి “ అన్నాడు. సురేంద్ర నవ్వుతూ “ ఎంత రావాలి నీకు ? “ అని అడిగాడు. “ మూడు రూపాయలే మామా “ అని నవీన్ తలకొట్టుకున్నాడు.     “ నీకు తక్కువే కావొచ్చు కాని అది నాకు చాలా ఎక్కువ రా “ అని నవీన్ తలపైన మొట్టికాయ వేసింది నయన. నవీన్, నయన అన్నా-చెల్లెళ్ళు , పైగా వాళ్ళుముగ్గరు  ఒకే తరగతిలో చదువుకునే వారు , ఇంక సురేంద్ర నవీన్ ను తన అద్దె ఇంటికి తీసుకువెళ్లి ఓనర్ కి చెప్పి అక్కడే ఉండటానికి ఒప్పించాడు దాంతో సురేంద్ర కి కాస్త అద్దె తగ్గింది , నయన ని లేడీస్ హాస్టల్ లో జాయిన్ చేపించారు. 

                

            ఆరు నెలలు గడిచాయి ,  కొత్త ఉద్యోగంతో సురేంద్ర అవసరాలు తీరేవి కాని బాధ తీరేది కాదు , తన బాధ ని ఎవరితోనూ చెప్పుకునే వాడు కాదు. ఒక రోజు అందరు కలిసి అరకు ట్రిప్ కి ప్రయాణమయ్యారు. వీళ్ళతో పాటు ఆఫీసు స్నేహితులైన  సంజన, సూర్య, సలీమా బేగం ఇంకా మేనేజర్ తార కూడా బయల్దేరారు. హైదరాబాద్ టూ విశాఖపట్నం రైలు లో వెళ్ళి, అక్కడి నుంచి అన్ని చూసుకుంటూ అరకు వెళ్దాం అని ప్రణాళిక తయారు చేసుకున్నారు. రాత్రి రైలులో నిద్ర పట్టక పక్కకి చుసిన సురేంద్ర కి సంజన కనబడలేదు , కాస్త దూరంలో ఎవరో ముగ్గురు ముసుగు మనుషులు ఒక అమ్మాయి నోరు మూసి  తీసుకెళ్తుంటే చూసి అడ్డగించాడు. ఇక విషయం అర్ధమైన సురేంద్ర ఆ రౌడీలను చితక బాది సంజన ను కాపాడాడు, భయంతో వున్న సంజన గట్టిగా సురేంద్ర చేతిని పట్టుకుంది , అది చుసిన నయన కళ్ళు చిట్లిస్తూ సంజనని కాస్త పక్కకు లాగింది. ఎందుకు అల చేసిందో అర్ధం కాని అందరు అయోమయంగా నయన ని చూస్తున్నారు కాని నయన మాత్రం ఎవరిని పట్టించుకోకుండా సురేంద్ర దెగ్గరకు వెళ్ళి “ నీకేమైనా దెబ్బలు తగిలాయా” అని మొఖం పైన చెక్ చేస్తూ అడిగింది. అది చూసిన నవీన్ కు విషయం అర్ధం అయింది. ఇంక అందరు సంజనకి జాగ్రత్తలు చెప్పి ఎవరి సీట్ల లో వాళ్ళు నిద్ర పోయారు కాని సంజన మాత్రం నిద్ర పోకుండా సురేంద్ర తనని ఎలా కాపాడాడో అని గుర్తు చేసుకుంటూ సిగ్గు పడుతూంది. 

            తెల్లారిన తరువాత అందరు విశాఖపట్నం లో దిగి అరకు కి వెళ్లారు.  ఎత్తైన కొండలు, చల్లటి గాలి, ఆహ్లాదం కలిగించే జలపాతాలు, అబ్బురపరిచే అడివి మార్గం ఎంతో అందంగా మనసును హత్తుకునే విధంగా ఉన్నాయి. గుడారాలు వేసుకొని తినడానికి తయారి చేస్తుంటే ఏదో ఒక వంక తో నయన, సంజన సురేంద్ర చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇదంతా చూస్తున్న మిగితా వాళ్ళకి విషయం అర్ధమైనా  సురేంద్ర కి చెప్పకుండా తమలో తామే నవ్వుకున్నారు . ఇద్దరూ చేసే అతి మర్యాదలను తట్టుకోలేక సురేంద్ర కి విసుగు వచ్చి “ అసలు మీ సమస్య ఏంటి?” అని అడిగాడు. ఇద్దరు ఏమీలేదు అన్నారు కాని మల్లి మొదలు. ఈ ట్రిప్ మొత్తం సంజన, నయన అతనికి దెగ్గర అవ్వడానికే ప్రయత్నించారు, సురేంద్ర మాత్రం ఏమి పట్టనట్టున్నాడు. చివరికి ఇంటికి వచ్చాక కూడా మెసేజ్ చేసేవారు , నవీన్ మాత్రం ఒక పక్క సురేంద్ర భావాలను గమనిస్తుండేవాడు.

            కొన్ని రోజుల తరువాత సురేంద్ర పనిచేసే కంపెనీలో వారందరిని సమావేశ పరిచారు. మేనేజర్ తార మాట్లాడుతూ “ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాను” అన్నారు. అప్పుడు సూర్య “ కొంపదీసి నేను ఆఫీస్ లో ఈరోజు నిద్రపోయానని తీసేస్తున్నార ఏంటి!” అని అనుకున్నాడు. తార మాట్లాడుతూ     “ మనకి CLUSTER MATRICS PVT LTD అనే పేరున్న జాతీయ సంస్థ ప్రాజెక్ట్ ని ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ ని సురేంద్ర, సూర్య, నవీన్, నయన, సంజన, సలీమా ల కు అప్పగిస్తున్నాను. రెండు రోజుల్లో ఆ కంపెనీ నుండి వ్యక్తులు వచ్చి ప్రాజెక్ట్ గురించి చెప్తారు.” అని చెప్పింది. నవీన్ లేచి " అందరం కష్టపడి పని చేసి ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాము “ అని గొప్పగా చెప్పాడు. బయటకి వచ్చిన తరువాత  నయన నవీన్ తల పైన మొట్టికాయ వేసి “ నీకెందుకురా అతి చేష్టలు , పని తక్కువ పెత్తనం ఎక్కువ గాడివి “ అని తిట్టింది. నవీన్ తల రుద్దు కుంటూ “ అబ్బా సిస్టరూ! మనల్ని ఎప్పుడూ కాపాడటానికి మన హీరో సురేంద్ర ఉన్నాడన్న ధైర్యం తో నే మేనేజర్ ముందు అల చెప్పాను “ అన్నాడు. సురేంద్ర నవ్వుతూ “ పర్లేదు నయన, నవీన్ చెప్పింది మంచిదే కదా “ అన్నాడు. అందరూ ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయారు.

            రెండు రోజులు గడిచాయి. మేనేజర్ తార అందరిని మళ్ళి సమావేశ పరిచి ఇద్దరు వ్యక్తులను పరిచయం చేశారు కాని సురేంద్ర మాత్రం వచ్చిన ఇద్దరు వ్యక్తులను చూసి ఆశ్చర్యపోయాడు. అది చుసిన నయన సురేంద్ర దెగ్గరకు వచ్చి “ ఏమైంది? అలా ఆగిపోయావ్” అని అడిగింది. సురేంద్ర కోపంతో “ వారెవరో కాదు – నన్ను  మోసం చేసి నా ప్రాజెక్ట్ ను అమ్మేసిన ఒకప్పటి నా స్నేహితుడు హర్ష,  ఇంకా నేను ప్రేమించిన అమ్మాయి పల్లవి” అని చెప్పి చిన్నగా బల్ల మీద కొట్టాడు. నయని అతని చేతిని చిన్నగా తట్టి ఊరుకొమ్మని సైగ చేసింది. మేనేజర్ తార వచ్చిన ఇద్దరికి సురేంద్ర మరియు అతని స్నేహితులను పరిచయం చేసింది. హర్ష , పల్లవి ఒక్కసారిగా సురేంద్ర ని చూసి ఆశ్చర్యపోయారు కాని వెంటనే తేరుకొని అందరికి ఈరోజు హోటల్ లో పార్టీ  ఇస్తున్నాము , రావాలి అని చెప్పారు. 

            

            పార్టీ లో అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు కాని సురేంద్ర మాత్రం అక్కడ ఉండలేక గది బయటికి వెళ్ళాడు. సురేంద్ర వెనకనుండి  పల్లవి వచ్చి                 “ హలో సురేంద్ర! ఎలా ఉన్నావ్? ” అని అడిగింది. సురేంద్ర చెమ్మగిల్లిన కళ్ళతో             “ ఎలా ఉన్నావ్ అని అడుగుతున్నావా , అసలు నన్ను ఎందుకు వద్దనుకున్నావో కారణమైనా చెప్పు “ అని బాధ , కోపం కలగలిసిన గొంతుతో అడిగాడు. పల్లవి మాత్రం ఎలాంటి భావం లేకుండా “ నీదెగ్గర డబ్బు, హోదా రెండూ లేవు. నిన్ను వద్దనుకుంటున్న సమయం లో హర్ష వచ్చి తన ప్రస్తుత అర్హత గురించి చెప్పాడు. అందుకే అతనిని ప్రేమించడం మొదలు పెట్టాను ఇప్పుడు మంచి స్థాయి లో ఉన్నాము కాని నువ్వు  చిన్న ఉద్యోగం చేసుకుంటున్నావు” అనింది. ఇంకా అవే కళ్ళతో                   “ సరే , నీకు నచ్చింది చేశావ్ కాని ఒక్కసారి కూడ నా గురించి ఆలోచన రాలేదా . అంటే నన్ను ఎందుకు వదిలేస్తున్నావ్ అనే విషయం చెప్పాలని అనిపించలేదా” అన్నాడు. “అయినా నీకు చెప్పగానే అప్పటికప్పుడు కోటీశ్వరుడు అయిపోతావా ఏంటి ? “ అని వేలాకోలం గా అన్నాడు హర్ష. అప్పుడే వాళ్ళ వెనుకవైపు నుండి వచ్చిన హర్ష ను చూసి సురేంద్ర పిడికిలి బిగించాడు అయినా ఇలాంటి నమ్మక ద్రోహులతో మాట్లాడి వ్యర్ధం అనుకొని గది లోపలికి వెళ్ళి అందరిని తీసుకొని ఆ హోటల్ నుండి ఇంటికి వెళ్ళిపోయారు.

            సురేంద్ర ఉదయాన్నే లేచి హుషారుగా ఇంట్లో పనులన్నీ చేస్తున్నాడు అది చూసి నవీన్ కంగారుపడుతూ “ హలో సురేంద్ర గారు, ఒంట్లో ఏమైనా బాగోలేదా లేక దారిలో  ఎక్కడైనా కింద పడ్డారా ? లేదు లేదు ఖచ్చితంగా ఎవరో చేతబడి చేసుంటారు” అన్నాడు. అప్పుడు సురేంద్ర ఆపమని చేతితో సైగ చేసి “ ఏంట్రా పొద్దున్నే  పిచ్చి కుక్క కరిచిందా! అలా వాగుతున్నావ్ “ అని నవ్వుతూ అన్నాడు. నవీన్ సూటిగా చూస్తూ           “ నిన్న మీరు మాట్లాడుకున్నదంతా విన్నా , నీకేమి బాధ గా లేదా రా?” అని అడిగాడు. సురేంద్ర తేలికగా చూస్తూ “ రేయ్ నవీన్, జీవితం వింతైనది రా. నిన్న నేను బాధపడింది నిజమే కాని రేపనే రోజున సంతోషం నన్ను వెతుక్కుంటూ వస్తుందన్న నమ్మకం ఉంది. ఆ క్షణం నేను కోల్పోయిన దానికి రెండింతలు సంపాదిస్తాను , అది డబ్బైన, హోదా అయినా లేక ప్రేమైన. అయినా తలరాతలో లేని బంధం, నమ్మకం లేని ప్రేమ ఎప్పుడైనా విడిపోక తప్పదు కదా ” అన్నాడు. ఆ మాటలు వినగానే నవీన్ సంతోషించాడు. ఇక నవీన్ బయల్దేరి ఆఫీసు కు వెళ్ళాడు. సురేంద్ర కొంత ఆలస్యం గా ఆఫీసు కు చేరుకున్నాడు. నవ్వుతూ వస్తున్న సురేంద్రను చూసి హర్ష, పల్లవి  ఆశ్చర్యపోయారు. సురేంద్ర మాత్రం వాళ్ళ దెగ్గరికి వచ్చి పలకరించి తన స్నేహితుల దెగ్గరికి వెళ్ళిపోయాడు.

            నయన, సంజన లు ప్రాజెక్టు సందేహాలు అని చెప్పి సురేంద్ర దెగ్గరనుండి కదలడం లేదు అలాగే సూర్య కూడా సలీమా చుట్టూ తిరుగుతున్నాడు. ఇంక మన నవీన్ ఏమో ఎదురుగా వున్న మేనేజర్ తార తో మాటలు కలపడానికి చూస్తున్నాడు. హర్ష కి సురేంద్ర ప్రవర్తన చాలా వింతగా అనిపించింది అయినా ఎప్పుడూ అతనిని ఒక కంట కనిపెడుతూనే ఉండాలి అనుకున్నాడు. రెండు రోజుల తరువాత సురేంద్ర, సంజన కాఫీ తాగటానికని బయటికి వెళ్ళారు అప్పుడు సంజన తన మనసులో అతడి పై వున్న ఇష్టాన్ని చెప్పింది దానికి  సురేంద్ర నవ్వుతూ “ సంజన, ప్రస్తుతానికి ప్రేమ ను నమ్మే పరిస్థితి లో నేను లేను, నీ సమయాన్ని వృధా చేసుకోకు” అన్నాడు. ఇదంతా చాటుగా గమనిస్తున్న నయనకి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు.  ఇద్దరూ తిరిగి ఆఫీసు లోకి వచ్చారు.

            తరువాత రోజు రాత్రి  నయన కనిపించలేదు. కంగారు పడుతున్న నవీన్ ని అడిగి విషయం తెలుసుకున్నాడు. చుట్టుపక్కల వెతుకుతున్న సురేంద్ర కు నయన ఒక పార్కు లో చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచిస్తూ కనిపించింది. సురేంద్ర గబా గబా తన దెగ్గరకు వెళ్ళి చెంప మీద కొట్టి, ఆవేశం తో “ ఎంత కంగారు పడ్డానో తెలుసా , నవీన్ చెప్పిన వెంటనే ప్రతీ చోట వెతుక్కుంటూ తిరుగుతున్నా” అన్నాడు. అతని ఆవేశం చూసి నయన ముసి ముసి గా నవ్వు కొంటుంది. అప్పుడు సురేంద్ర “ ఏం ! అంత తమాషాగా వుందా. ఇంకొకసారి ఇలా చెప్పకుండా కంగారు పెట్టే పనులు చేశావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు” అన్నాడు. నయన సూటిగా చూస్తూ “ ఎందుకో తెలుసుకోవచ్చా ! “ అని అడిగింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగి పోయాడు సురేంద్ర. “ పోనీ నన్ను చెప్పమంటారా “ అని నయన అడుగుతుంటే ఏమి అవసరం లేదని వెనుదిరిగాడు సురేంద్ర. “ I LOVE YOU “ అని నయన సురేంద్ర ని గట్టిగా హత్తుకొని చెప్పింది. నయనని దూరంగా జరిపి “ చూడు నయన , నువ్వు నా స్నేహితురాలివని వెతుక్కుంటూ వచ్చాను అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు “ అని తన కళ్ళలోకి చూడకుండా చెప్పాడు. నయన బాధగా “ నిన్ను నువ్వు మోసం చేసుకోగలవు కాని నీ కళ్ళలోని ప్రేమ స్పష్టంగా కనబడుతుంది అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావ్ , నాలో ఏమైనా లోపం ఉందా “ అని కన్నీళ్ళతో అడిగింది. 


            సురేంద్ర బాధ నిండిన స్వరం తో  “ పుట్టిన కొన్ని నెలలకే అయిన వాళ్ళందరిని కోల్పోయాను చివరికి కొన్ని నెలల ముందు తాతయ్యని కూడా పోగొట్టుకున్నాను, బంధువులకి నేను అవసరం లేదు , నమ్మించి స్నేహితుడు మోసం చేసాడు , నమ్మిన ప్రేమ తన దారి తాను చూసుకుంది , ఈ ఉద్యోగం రాకపోతే నేనెవరో నాకే తెలియని పరిస్థితి లోకి వెళ్ళేవాడిని . ఇంతటి దురదృష్టవంతుడి జీవితానికి నవ కిరనానివి నువ్వు , నన్ను ప్రేమించడం వల్ల నీకేమైనా జరిగితే ఇంక నేను బ్రతకలేను అందుకే వద్దనుకుంటున్నాను” అని చెప్పి కళ్ళు తుడుచుకున్నాడు. నయన నవ్వుతూ                “ రేపేదో జరుగుతుందన్న భయం తో ఈరోజు సంతోషంగా వుండడం మానేస్తామా అయినా నిన్ను ప్రేమించడం వల్ల కష్టం వచ్చినా సరే నేను ఇష్టంగా స్వీకరిస్తాను “ అని చెప్పి సురేంద్ర ను హత్తుకుంది. సురేంద్ర నమ్మకమైన స్వరంతో “ నా శ్వాస చివరి క్షణం వరకు నీకు ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను” అని చెప్పి కాసేపటికి ఇంటికి చేరుకున్నారు. వాళ్ళిద్దరిని కలిసి రావడం చుసిన నవీన్ కి చాలా సంతోషం వేసింది, పరిగెత్తుకుంటూ వాళ్ళ దెగ్గరికి వచ్చి “ ఏమైంది? ” అని నయనని చూస్తూ అడిగాడు.  నయన నవ్వుతూ “ మేము క్షేమంగానే ఉన్నాము” అని చెప్పింది. విషయం అర్ధమైన నవీన్ ఇంకేం మాట్లాడలేదు. ఒకరికొకరు టాటా చెప్పుకొని వెళ్ళిపోయారు. 

             చివరికి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు  అయిపోయాయి ఇక హర్ష, పల్లవి వచ్చిన పని కూడా పూర్తి కావడం తో తిరిగి వాళ్ళ ఆఫీసు కు వెళ్ళిపోవాలి అనుకున్నారు. అప్పుడే వాళ్ళ ఆఫీసు గేటు ముందు ఐదు ఖరీదైన కార్లు ఆగాయి, మధ్య కారులో    నుంచి గంభీరకరమైన మొహం తో యాభై సంవత్సరాలు గల వ్యక్తి దిగాడు. అతడిని చూడగానే హర్ష పరిగెత్తుకుంటూ వెళ్ళి వినయంగా వంగి నమస్కరించాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు హర్ష పనిచేసే కంపెనీ CEO “ విష్ణు చంద్ర భూషణ్ “. ఆయన మాట్లాడుతూ “ Mr. హర్ష Ms. పల్లవి , మిమ్మల్ని ఈ కంపెనీ నుండి తీసేస్తున్నాము మిగితా విషయాలు ఏమైనా మాట్లాడాలి అంటే మా కొత్త మేనేజర్ సురేంద్ర తో మాట్లాడండి  ” అన్నారు. హర్ష, పల్లవిలకు వాళ్ళ కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది, కంగారు పడుతూ విష్ణు చంద్ర ని బ్రతిమాలారు కాని ఆయన కనీసం వాళ్ళ మొహం కూడా చూడకుండా సురేంద్ర దెగ్గరకు వెళ్ళి పలకరించి వెళ్ళిపోయాడు. 

            హర్ష కోపంగా “ సురేంద్ర! నన్ను నేరుగా ఎదిరించలేక ఇలా పిరికిపంద లా గా నా ఉద్యోగాన్ని తీయిస్తావా, ఇలా చేసి నువ్వేదో గెలిచావనుకోకు , నీ అంతు చూస్తా “ అని అరిచాడు. పల్లవి కూడా అసహ్యంగా “ నువ్వూ అందరి లాంటి వాడివే , నీ ప్రేమని కాదన్నానని ఇలాంటి నీఛమైన పని చేస్తావా , నువ్వు అసలు మనిషివే కాదు “ అని చెప్పింది. అవన్ని ప్రశాంతంగా విని వాళ్ళు ఆప గానే “ మీరు చెప్పడం అయిపోతే ఇంక నేను మాట్లాడతాను , ఏంట్రా పెద్ద నీతిమంతుడిలా మాట్లాడుతున్నావ్ , నేను కష్టపడి చేసిన ప్రాజెక్టును నువ్వు కొట్టేసి వేరే కంపెనీ కి అమ్మేయొచ్చు , దానివళ్ళ నా ఉద్యోగం పోయినా నేనేమి మాట్లాడకూడదు, నా ప్రేమని నా దెగ్గర నుండి లాక్కున్న ఏమనకూడదు , ఇప్పుడు చేసిన ప్రాజెక్టు కూడా నువ్వే అంతా చేసినట్టు మీ ఆఫీసు లో చెప్పుకుంటుంటే నేను చేతులు కట్టుకొని కూర్చోవాలా , అందుకే మీ CEO గారిని కలిసి నీ గురించి మొత్తం చెప్పా “ తరువాత పల్లవి వైపు చూస్తూ “ నాకు ప్రేమించడం మాత్రమే తెలుసు బాధపెట్టడం తెలియదు , నీ ఉద్యోగం పోవడానికి కారణం కేవలం నీ పని తీరు సరిగ్గా లేకపోవడమే “ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంక చేసిదేమి లేక హర్ష పల్లవి వాళ్ళకు తోచిన దిక్కుకు వెళ్ళిపోయారు. ఇదంతా చుసి అతని స్నేహితులందరూ  ఆశ్చర్యపోయారు, నయన సురేంద్ర దెగ్గరకు వచ్చి “ ఇదంతా ఎలా చేశావ్” అని  అడిగింది . అప్పుడు సురేంద్ర తన తాతయ్య చెప్పిన మాటలని గుర్తుకు తెచ్చుకొని నవ్వుతూ “ మా తాతయ్య  ఆ CEO గారికి  చేసిన సాయం నన్ను ఈ స్థానం లో నిలబెట్టింది “ అన్నాడు. తరువాత నయన నిరాశగా మొహం పెట్టి “ ఇప్పుడు నువ్వు మంచి స్థానంలో వున్నావు గా నీకు తగిన మంచి అమ్మాయిని చూసి ప్రేమించు” అని చెప్పి వెళ్ళిపోవాలి అని వెనుతిరిగింది సురేంద్ర ఆమె చెయ్యి పట్టుకొని ఆపి “ నేను ప్రేమించింది నిన్ను అంతే గాని ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చిందని ఇష్టాన్ని , ప్రేమని మార్చుకుంటానని ఎలా అనుకున్నావ్ , అయిన నువ్వు నా చిట్టి DEVILవి కదా నిన్ను వదిలి నేను ఎక్కడివెల్తాను “ అని చెప్పి కౌగిలించుకున్నాడు. ఇది చుసిన నవీన్ “ హలో ప్రేమ పక్షులారా కాస్త మాకు కూడా చోటు ఇస్తారా “ అని అన్నాడు. నవీన్ – తార , సూర్య – సలీమా లు కూడా తమ ఇష్టాలను తెలియజేసారు. 


By Shaik Riyaz Basha



0 views0 comments

Recent Posts

See All

দিনলিপি

By Tanushree Ghosh Adhikary 'দিব্যি আছি', সুনীল গঙ্গোপাধ্যায়ের কবিতার মতো।  তুমিও তোমার মতো দিব্যি আছো। মনে পড়ার গল্পে আজ আর যাব না। ভুলত...

Waiting For Someone?

By Kasturi Bhattacharya ‘I keep insisting you on doing things that you do not like, I get it, but we don’t have any other options.’ ‘I...

The Hostel Menace

By Jameel Shahid Raza Hello people, I am Jameel, 18 years old, I am currently pursuing engineering. I live in hostel which is free for...

コメント


bottom of page