By Yenugu Tanmaya
చిరు చినుకుల జడి వానకి వీడుకోలు పలుకుతూ సన్నటి చలి మోసుకొచ్చే శీతాకాలం కి స్వాగతం పలికింది కాలం…
శీతాకాలం వెంట తెచ్చే చలి అణువణువు వనికించేలా పెరిగిపోయింది ఈ డిసెంబర్లో…
వణికిస్తున్న చలిలో పండు వెన్నెల రాత్రి ఎగిసిపడుతున్న కేరతల్ని శాంతపరుస్తున సముద్రాన్ని ఆరాధిస్తునా నేను…
సమయం వేగంగా పరుగులు తిస్తుంది నా మదిలో మెదులుతున్న ప్రశ్నలు అంతకన్నా వేగంగా పరుగులు తిస్తున్నాయి…
కాలం ముందుకి కదులుతుంది కాలంలో కలిసిపోయిన గతం తాలూకు ఆలోచనల్లోకి కదులుతున్న నేను…
పసి పిల్లల బోసి నవ్వులాంటి స్వచ్ఛమైన నవ్వు నాది…
నిత్యం సంతోషపు ఆనవాలే తప్ప కన్నీటి చారలకి చొట్టే లేని నా నయనాలు…
పచ్చని పంట పొలాన్ని చూస్తే కలిగే హాయి ఎల్లప్పుడూ నా ముఖంలో ప్రభవించేది…
ఉషోదయపు భానుడిలా జీవితమంతా ప్రకాశవంతంగా మలుచుకునేదాని…
రంగు రంగుల సీతాకోకచిలుకల ప్రతి జీవన ప్రయాణంలో రంగులు ఆద్దుకునేదాని…
తాను నా అందమైన ప్రపంచంలోకి చెప్పకుండా వచ్చిన అతిది…
ప్రేమని అధ్భుతమైన ఊహగా ఆస్వాదించే నాకు అనుకొని ఉప్పెనగా ప్రేమని పరిచయం చేశాడు తాను…
నా పున్నమి జీవితాన్ని అమావాస్య రాతిరిగా మార్చాడు తాను…
సంతోషం నిందుకున కళ్ళలో కన్నీటికి మాత్రమే చోటు ఉండే జలపాతం లాగా మార్చాడు తాను…
నాతో ఎప్పుడు చెలిమి చేసే నా ఆనందం అల్లంత దూరంకి జారిపొయ్యింది…
అందమైన హరివిల్లు మబ్బులలో దాగిపొయ్యి చంద్రుని విరహ వేదన చెప్పే చీకటి నలుపును పరిచయం చేసింది నాకు…
గల గల పారె నది ప్రవహంలాంటి మాటలకి ఊపిరి ఆడని అడ్డుకట్ట పడింది…
కన్నీటితో సావాసం ఒంటరితనంతో స్నేహం అలిసిన జీవితంతో పరుగులు నేనేనా ఇది? నాలో నేనేనా?...
కొన్ని పరిచయాలు జీవితాన్ని జీవన విధానాన్ని చాలా మార్చేస్తాయి ఎంతలా అంటే నిన్ను నువ్వే మరిచిపొయ్యేలా…
Naalo Nenena
Bidding farewell to the drizzling rain Winter arrives with a chilly refrain.
December deepens, the cold spreads wide as frost seeps into the countryside.
Beneath the moon's soft, silvery glow Waves rise and crash yet calmness they show I stand in awe by the restless sea.
While thoughts race faster than time can flee.
The clock moves forward, its course unbent but I drift back to the past's lament.
My heart, once pure as a child's soft grin.
My eyes always reflects happiness where there is no place for a single stain of tears.
With joy that blossomed face like fields freshly sown.
My life was bright as the dawn’s first ray.
Painting colours along life’s way like colourful butterflies in a vibrant dance.
Each day brought hues, a hopeful chance.
Then he arrived, unbidden, unknown into my beautiful world.
I am someone who thinks love is a beautiful dream for me but from nowhere he introduced me to love.
But the moonlit joy of my peaceful skies he turned to nights where darkness lies.
My laughter fled my joy withdrew as tears cascaded where smiles once grew.
The rainbow vanished, the clouds took its place and darkness loomed with a somber face.
The river of words that once freely flowed now choked, and silence steadily snowed.
Companions now are tears and despair, loneliness follows me everywhere, chasing hopeful life with tired soul, Is this me? Am I in me?
Some bonds can change the life you know so deeply you lose your very glow.
By Yenugu Tanmaya